NTV Telugu Site icon

Crime in Hyderabad: రెండో భర్తతో భార్య.. పెట్రోల్ పోసి నిప్పంటిచిన మొదటి భర్త

Crime In Hyderabad

Crime In Hyderabad

Crime in Hyderabad: భార్యా భర్తల కాపురంలో అనుమానాలు, అన్యోన్య జీవితంలో మనస్పర్థలు, కొద్దిరోజులుగా కూడా కలిసి బతికలేని బతుకులు. ఏదో ఒక కారణం విడిపోయి మరో వ్యక్తులతో సహజీవనం, వివాహేతర సంబంధాలు ఇది ఈసమాజంలో జరుగుతున్న భార్యాభర్యల సంబందానికి గల కారణాలు. ఒకనొకరు అర్థం చేసుకునే రోజులు పోయాయి. ఒకరిపై మరొకరు పైచేయి ఉండాలని తగువులతో కుటుంబాలను విచ్చిన్నం చేసుకునే రోజులు వచ్చాయి. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జీవితాలు సర్వనాసనం మవున్నాయి. కోపంతో కొందరు చావడానికి చంపడానికి కూడా వెనుకడటం లేదు ఇలాంటి ఘటనే మన భాగ్యనగరంలో చోటుచేసుకుంది.

Read also: T20 World cup: సెమీస్‌కు ముందు టీమిండియాకు షాక్‌.. రోహిత్‌కు గాయం!

ఆమెకు పెళ్లైంది. మొదటి భర్తతో గొడవల కారణంగా కారణంగా మొదటి భర్తతో దూరంగా ఉంటోంది. కానీ.. మరొకరితో వివాహేతర సంబందం ఏర్పడి అతనితో రెండో వివాహం చేసుకుని ఒక బాబుతో ఉంటుంది. ఈవిషయం తెలుసుకున్న మొదటి భర్త భార్యపై కోపం పెంచుకున్నాడు. ఆమెను మట్టుపెట్టాలని పథకం వేసుకున్నాడు. చివరకు ఆటైం రానే వచ్చింది. నిన్న రాత్రి నారాయణగూడ ఫ్లైఓవర్ కింద రెండో భర్తతో కనిపించడంతో ముగ్గురుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ముగ్గురికి గాయాలు గాంధీ హాస్పిటల్ కి తరలించారు. బాబు 40 శాతం పైగా కాలిపోవడంతో పరిస్థితి సీరియస్ గా ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇండియాపై ఫారన్‌ బ్యాంక్‌ ఫోకస్‌

Show comments