NTV Telugu Site icon

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 24కు విచారణ వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు కవితపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని ఆరోపించిన కవిత, రౌస్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే.

Read also: Hyderabad: ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

కాగా.. 1,149 పేజీలతో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆమెకు కింది కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ స్యూర్యకాంత శర్మ ఇవాళ విచారణ చేపట్టారు. లిక్కర్‌ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్‌ కోర్టు (రౌజ్‌ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్‌ పిటిషన్‌ను నిరాకరిస్తూ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అయితే పిటిషన్ పై విచారణ విన్న న్యాయమూర్తి జస్టిస్‌ స్యూర్యకాంత శర్మ విచారణ ఈనెల 24కు వాయిదా వేశారు.
Narendra Dabholkar : డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులకు శిక్ష