Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News The Hearing On Kavitha Bail Petition Has Been Adjourned To 24th Of This Month

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా..

Published Date :May 10, 2024 , 12:47 pm
By Bhanu
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 24కు విచారణ వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు కవితపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని ఆరోపించిన కవిత, రౌస్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే.

Read also: Hyderabad: ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

కాగా.. 1,149 పేజీలతో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆమెకు కింది కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ స్యూర్యకాంత శర్మ ఇవాళ విచారణ చేపట్టారు. లిక్కర్‌ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్‌ కోర్టు (రౌజ్‌ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్‌ పిటిషన్‌ను నిరాకరిస్తూ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అయితే పిటిషన్ పై విచారణ విన్న న్యాయమూర్తి జస్టిస్‌ స్యూర్యకాంత శర్మ విచారణ ఈనెల 24కు వాయిదా వేశారు.
Narendra Dabholkar : డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులకు శిక్ష

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adjourned
  • bail petition
  • Delhi High Court
  • delhi liquor scam case
  • MLC Kavitha

తాజావార్తలు

  • Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..

  • Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

  • Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

  • Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions