TS RTC: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బోయిన్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 8 ఏళ్ల స్రవంతి, 7 ఏళ్ల శ్రావ్యలను హత్య చేసి తండ్రి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని మాత్రలు ఇచ్చి కూతుళ్లను హత్య చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహిటిన అక్కడకు చేరుకున్న పోలీసులు శ్రీకాంత్ ను, పిల్లలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ తండ్రికి ఎంత కష్టమొచ్చిందో ఏమో కన్న పిల్లలను అంతలా చంపేసి తనుకూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భార్య లేదా? లేక భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిందా? భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవలు కావడంతో పిల్లలను చంపి శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది విచారణ చేపట్టారు.
ఇక మరోవైపు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో సజ్జపూర్ తండాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలిని అత్యాచారం చేసిన వ్యక్తిని అన్న హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. తండాలో మతిస్థిమితం లేని తన చెల్లెలిపై నాగిశెట్టి పవార్ (40) అనే వ్యక్తి అత్యాచారం చేస్తుండగా అన్న రాజు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పవార్ పై పగ పెంచుకున్న అన్న రాజు ఎలాగైనా చంపాలని ప్లాన్ వేసి రెండ్రోజుల కృతం మద్యం తాగుదామని నాగిశెట్టి పవార్ ని పిలిపించాడు. మద్యం సేవించిన తర్వాత నాగిశెట్టి మత్తులోకి జారగానే మద్యం సీసాలు, బండ రాళ్లతో కొట్టి దారుణ హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
ఖమ్మం జిల్లాలో గ్రామానికి చెందిన కలపొంగు రామారావు, గంగమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు రాజేష్ (27) కల్లుగీత పని చేస్తుండగా, చిన్న కుమారుడు నవీన్ నవీన్ పెయింటింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే సోదరులకు మద్యం సేవించే అలవాటు ఉంది. అప్పుడప్పుడు మద్యం సేవించి, ఆ మత్తులో గొడవ పడేవారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రాజేష్ ఇంటి ముందు నిల్చుని గట్టిగా కేకలు వేశాడు. తండ్రి రామారావు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రాజేష్ తండ్రిపై చేయి చేసుకున్నాడు. అది చూసిన నవీన్ అక్కడున్న బీరు బాటిల్ పగలగొట్టి ఆ బాటిల్ తో రాజేష్ పై దాడికి యత్నించాడు. నవీన్ అటుగా వెళుతుండగా రాజేష్ తండ్రి గట్టిగా పట్టుకోగా.. పగిలిన బీరు బాటిల్ తో రాజేష్ మెడపై నవీన్ పొడిచాడు. అనంతరం తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తదుపరి రోడ్డుపై మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Health Tips: మీ పర్సుని అక్కడ పెడుతున్నారా? అయితే ఇది ఒక్కసారి చూడండి..