NTV Telugu Site icon

Boora Narsaiah Goud: ఉపాధిహామీ పథకం తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud

Boora Narsaiah: ఉపాధిహామీ పథకం.. తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయి ? అని ప్రశ్నించారు. బిల్లులు ఎత్తుకున్నారు ? చట్ట వ్యతిరేకంగా వాడారు ? కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల ట్రస్ట్ పెట్టి.. మీ పేరు మీద కిట్స్ ఇవ్వండని అన్నారు. ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ అని పేరు పెట్టడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Minister Malla Reddy: బండి సంజయ్‌కి మంత్రి మల్లారెడ్డి సవాల్‌.. రాజీనామా చేసి రాజకీయ సన్యాసం స్వీకరిస్తా..!

కేంద్రం ఏ పథకం పెట్టిన ప్రధానమంత్రి అని పెడుతుంది అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి పేరు మీద న్యూట్రీషియన్ కిట్ పంపిణీ చేయాలని అన్నారు. బీఆర్ఎస్ లో కేవలం ఒక కుటుంబం కోసమే రాజకీయ వెట్టి చాకిరే వుంటుందని, కేసీఆర్ ఆడిక్షన్ నుంచి సర్పంచ్ లు, ఎంపీటీసీలు బయటకు రండి అని పిలుపునిచ్చారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులు పొందే అవకాశం కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు. బీజేపీలో వ్యక్తి కాదు.. పార్టీయే ముఖ్యమన్నారు.
Attack on female sarpanch : మహిళా సర్పంచ్‌పై దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు..