ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు వెళ్లి తమకు ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్లో పాదయాత్ర మొదలు పెట్టారు. పద్మారావు గౌడ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.…
నెలరోజులుగా హోరెత్తించిన ప్రచారం పలు నియోజకవర్గాల్లో ముగిసింది. 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా.. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగించారు. అందులో.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలకు ప్రచారం ముగిసినట్లుగా ఎన్నికల కమిషన్ తెలిపారు.
CM Siddaramaiah: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి, మణిగిళ్ల, మోజర్ల, మదిగట్ల, అమ్మపల్లి, ఆల్వాల, చిన్న మందడి, దొడగుంట పల్లి, అంకాయ పల్లి తండా గ్రామాల్లో మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, నాయకుడు నాగం తిరుపతి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదిగట్ల గ్రామంలో బీజేపీ పార్టీ…
తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే.. 3 రోజుల షెడ్యూల్ రిలీజ్ అయింది. 24, 25, 26 తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
దేశ ద్రోహం కేసు, తెల్గి స్కాంలో మూడేళ్లు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా.. ప్రచారంలో జోరు పెంచారు. ఈరోజు గోల్నాక డివిజన్లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు గులాబీ అధినేత నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.