Site icon NTV Telugu

తీన్మార్‌ మల్లన్నపై బీజేపీ సీరియస్‌

బిజెపి నేత చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు చెందిన ఓ మీడియా సంస్థ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ప్రస్తావనతో ట్విటర్‌లో ఓ పోల్‌ క్వశ్చన్‌ను పోస్ట్‌ చేసింది. బాడీషేమింగ్‌తో కూడిన ఆ పోస్ట్‌ తీవ్ర దుమారం రేపింది. దీనిపై హిమాన్షు తండ్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కేటీఆర్‌ సోదరి కవితతో పాటు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, టీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ తదితరులు ఖండించారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈ వ్యవహారంపై బీజేపీని కడిగిపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే బీజేపీ స్పందించింది.

https://ntvtelugu.com/ias-officers-who-go-to-school-and-find-out-about-problems/

నవీన్‌వి వ్యక్తి గత కామెంట్సే అయినప్పటికీ.. ఇలాంటి చేష్టల్ని పార్టీ సహించబోదని చెప్తోంది. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ.. వాళ్ల కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో మల్లన్నపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక వ్యక్తిగత విమర్శలకు దూరం అంటున్న బీజేపీ నేతలు.. పార్టీలో మల్లన్న ఒక్కరే కాదు ఎవరు చేసినా తప్పేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ కుటుంబంలో రాజకీయ నేతలపై మాత్రమే తమ పోరాటమని కమల శ్రేణులు చెప్తున్నాయి.

Exit mobile version