NTV Telugu Site icon

Thatha Madhu: బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..!

Thatha Madhu

Thatha Madhu

తెలంగాణ సమాజం మీద, ప్రజల మీద, టీఆర్ఎస్ పార్టీ మీద, సీఎం కేసీఆర్ మీద బీజేపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతూన్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం జిల్లా అద్యక్షుడు తాతామధు.. ఖమ్మం నగరంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీజేపీ నాయకులు.. తుక్కుగూడ మీటింగ్‌లో జై తెలంగాణ అని అన్నారా..? అని ప్రశ్నించిన ఆయన.. సీఎం కేసీఆర్ ను నిజాం అని కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. గాడ్సే వారసులు వచ్చి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారన్నారు. లక్షలది మంది కార్మికులు ఉన్న సింగరేణి నీ ప్రవేట్ పరం చేయటనికి ప్రయత్నలు చేస్తున్నారు. ఇద్దరు గుజరాతీయులు, మరొక ఇద్దరు గుజరాతీయులకు దేశ సంపదను దోచిపెడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌కు సిగ్గు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేసారో ప్రజలకు చెప్పాలి. దేశం గురించి, రాష్ట్రం గురుంచి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకీ, నాయకులకు లేదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఇళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడలి… లేకపోతే ఖమ్మం విధుల్లో ఊరేగించే రోజులు దెగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు తాతా మధు.

Read Also: Monsoon: తెలంగాణకు భారీ వర్ష సూచన