TG ECET: రేపు టీజీ ఈసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 12:30 గంటలకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG ECET: TG ESET 2024 ఫలితాలు రేపు (సోమవారం మే 20) విడుదల కానున్నాయి. మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ పి చంద్రశేఖర్ ప్రకటించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. Ecet ఫలితాల కోసం ఈ వెబ్సైట్ https://ecet.tsche.ac.in/ లాగిన్ చేయండి. టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 6న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఈ పరీక్షకు తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44, ఏపీలో 7 కేంద్రాలు మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు.
Read also: RR vs KKR: లీగ్ దశలో చివరి మ్యాచ్.. కేకేఆర్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా..
Also Read
- HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
- Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
- OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
- Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
మరోవైపు తెలంగాణలో PGESET-2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో PGECET రాత పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఎ అరుణ కుమారి వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. PGESET పరీక్షలు జూన్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ 9వ తేదీలోగా పరీక్షలు పూర్తి కావాలి. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేశారు. తెలంగాణ పీజీఈసెట్ రాత పరీక్షలు జూన్ 10 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 13న పూర్తవుతాయి. ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్ (టీఎస్ పీజీఈసెట్ 2024) నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
AP-Telangana Rains: ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!