NTV Telugu Site icon

New Liquor Brands: కొత్త బీర్‌ బ్రాండ్‌లను తాత్కాలికంగా నిలిపి వేసిన రాష్ట్ర ప్రభుత్వం..

Telangana New Beer Brand

Telangana New Beer Brand

New Liquor Brands: తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసింది..?. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వస్తున్న ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్‌లపై నెటిజన్లు తమ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. కొత్త మీమ్స్‌తో తమ నిరసనను తెలిపారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త బీర్లు సరఫరా చేసేందుకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చింది.

Read also: Chandrababu: శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం..

ఈ ఐదు కంపెనీలు తెలంగాణలో దాదాపు 27 రకాల బీర్‌లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. లైసెన్సు పొందిన కొన్ని కంపెనీలకు సరైన నేపథ్యం లేకపోవడం, కొన్ని చోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు కథనాలు రావడంతో ప్రజల నుంచి, మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటికి ఇచ్చే అనుమతులను ప్రస్తుతానికి ప్రభుత్వం నిలిపివేసినట్లు వార్తుల వస్తున్నాయి. మరోవైపు కొత్త బ్రాండ్ బీర్ పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని.. పరిశీలించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో ఉంచిందని.. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కంపెనీలు బీరు సరఫరా చేయకపోవచ్చే తప్ప మద్యం కృత్రిమ కొరత లేదన్నారు.
Chandrababu: శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం..

Show comments