New Liquor Brands: కొత్త బీర్ బ్రాండ్లను తాత్కాలికంగా నిలిపి వేసిన రాష్ట్ర ప్రభుత్వం..
- ఇకనుంచి కొత్త బీర్ బ్రాండ్లు లేనట్లే
- కొత్తకొత్త మీమ్స్‌తో నెటిజన్ల నిరసనలు
- కొత్త కంపెనీల పై అనుమానాలు
- కొత్త బీర్ బ్రాండ్లను తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపి వేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Liquor Brands: తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసింది..?. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వస్తున్న ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు తమ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. కొత్త మీమ్స్‌తో తమ నిరసనను తెలిపారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త బీర్లు సరఫరా చేసేందుకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చింది.
Read also: Chandrababu: శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం..
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ఈ ఐదు కంపెనీలు తెలంగాణలో దాదాపు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. లైసెన్సు పొందిన కొన్ని కంపెనీలకు సరైన నేపథ్యం లేకపోవడం, కొన్ని చోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు కథనాలు రావడంతో ప్రజల నుంచి, మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటికి ఇచ్చే అనుమతులను ప్రస్తుతానికి ప్రభుత్వం నిలిపివేసినట్లు వార్తుల వస్తున్నాయి. మరోవైపు కొత్త బ్రాండ్ బీర్ పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని.. పరిశీలించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో ఉంచిందని.. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కంపెనీలు బీరు సరఫరా చేయకపోవచ్చే తప్ప మద్యం కృత్రిమ కొరత లేదన్నారు.
Chandrababu: శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం..
తాజావార్తలు
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!