T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?
- మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి మార్పు.. అసంతృప్తి వెల్లువ
- సునీతారావు ఆవేదన.. గుర్తింపు దక్కలేదన్న విమర్శ
- మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిపై పోటీ
- కొత్త చీఫ్ ఎర్రబెల్లి స్వర్ణ ముందున్న సవాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు మహిళా విభాగంలో చిచ్చు రేపింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను అధిష్టానం నియమించడంతో, ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న సునీతారావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా పక్కన పెట్టడంపై ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
చాలా కాలంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో మార్పు ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, సునీతారావు తన పట్టును నిలుపుకుంటూ వచ్చారు. తన హయాంలో మహిళా విభాగాన్ని యాక్టివ్‌గా ఉంచడంలో ఆమె సక్సెస్ అయ్యారని పార్టీ వర్గాల్లో పేరుంది. అయితే, తాజాగా ఏఐసీసీ (AICC) ఎర్రబెల్లి స్వర్ణ పేరును ఖరారు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన తనను, ప్రభుత్వంలో కనీసం ఒక పదవి ఇవ్వకుండా తొలగించడం అవమానకరమని సునీతారావు భావిస్తున్నారు.
Also Read
- YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
సునీతారావు ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే, ఈ పదవికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. నిన్నమొన్నటి వరకు మేయర్‌గా ఉండి, పార్టీ మారిన విజయలక్ష్మికి వెంటనే కీలక పదవి ఇవ్వడంపై సునీతారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకంటే జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ, తనకు కేవలం కమిషన్ మెంబర్ పదవి ఇవ్వజూపడంపై ఆమె ఒక సీనియర్ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణకు ఇది పూలపాన్పు ఏమీ కాదు. ప్రస్తుతం పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను చక్కదిద్దడం ఆమె ముందున్న మొదటి సవాలు. పదవుల భర్తీ విషయంలో మహిళా నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి, అందరినీ కలుపుకొని పోవాల్సిన గురుతర బాధ్యత ఆమెపై ఉంది. ముఖ్యంగా సునీతారావు వంటి సీనియర్లను బుజ్జగించి, వారి సహకారం పొందేలా చేయడంలోనే ఆమె సక్సెస్ ఆధారపడి ఉంది.
PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..
తాజావార్తలు
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!