Basara IIIT: బాసరలో అసలు ఏం జరుగుతోంది? విద్యార్థులకు ఎదో ఒక సమస్య? నిజంగా ఇది విద్యార్థుల సమస్యేనా? లేక మరేదైననా? ఒకటి కాదు రెండుకాదు కొన్ని నెలలుగా సమస్యలపై విద్యార్థుల పోరాటం? విద్యార్థులకు సౌకర్యాలు ఎందుకు లేవు? త్రిబుల్ ఐటీని రాజకీయంగా టార్గెట్ చేశారా? ఇంతకు ముందు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలే ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలున్నాయని విద్యార్థులు ఆందోళన చేసిన ఘటన కొన్ని నెలలుగా జరుగుతుంది. విద్యార్థులకు ఫోన్‌లు అనుమతిలేదు. బయట ప్రపంచంతో మాటలు లేవు. పరిమిషన్ తీసుకున్నా బయటకు వెళ్లేఉందుకు అనుమతించరు. ఒకవేళ పోలీసులకు ప్రశ్నిస్తే.. ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ విద్యార్థులు తెలుపుతున్నతీరు. దీని నిదర్శనమే.. గంజాయి దొరికిందని ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేయడమా? త్రిపుల్ ఐటీ కాదు.. ట్రబుల్ ఐటీగా తయారైందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ట్రబుల్స్.. నేటికైనా తీరేనా సమస్యలు.. విద్యార్థులకు ఫోన్ అనుమతి లేదు, బయట ప్రపంచంలో అనుమతించరు. హాస్టల్లో వున్న విద్యార్థికి ఆర్థిక పరిస్థితులు ఎలా వచ్చాయి? ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులైతే కనిపించడంలేదు! అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆగస్టు 23న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ తనఫోన్ డేటా మాత్రం డిలీట్ అయ్యింది. పోలీసులు మాత్రం ఆర్థిక పరిస్థితులు అంటున్నారు. విద్యార్థి డేలా రీకవీ చేసామని ఆర్థిక ఇబ్బందులతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థి రాథోడ్ సురేష్ మృతి పట్ల ట్రిపుల్ ఐటీ అధికారుల సంతాపం తెలిపారు. విద్యార్థి రాథోడ్ సురేష్ మృతి పట్ల ఆర్జీయూకేటి బాసర ఉపకులపతి వెంకట రమణ, సంచాలకులు ప్రో. సతీష్ కుమార్ సంతాపం తెలిపారు.వ్యక్తిగత కారణాలతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని వీసి పేర్కొన్నారు. ఈసందర్భంగా వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇవ్వన్ని ఇలా ఉంటే ట్రిపుల్ ఐటీ వద్ద కు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు వస్తే, పోలీస్ లు అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. క్యాపంస్ లో పోలీస్ ల వేదింపులు ఎక్కువ అవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు గురి చేస్తున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ లో ఆంక్షల పై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔట్ పాస్ తీసుకొని బయటకు వెళ్లిన కొంత మంది విద్యార్థులను పోలీసులు, సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. మీడియా ను సైతం పోలీస్ లు అడ్డుకున్నారు. బంద్ పిలుపుతో విశ్వవిద్యాలయంలోని తరగతి గదులు బోసి పోయాయి. విద్యార్థుల అంతా హాస్టల్స్ కే పరిమితం అయ్యారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేష్ ప్రాణాలు కోల్పోవడం, ఆ తరువాత ఎస్.జీ.సీ లపై కేసు నమోదు చేయడం, మొన్న గంజాయి దొరికిందని ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేయడం ట్రిపుల్ ఐటీ లో అసలు ఏం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవ్వన్ని ఇష్యూలు చివరికి ఎటు దారి తీస్తాయో ముందు ముందు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
Terror Links: అస్సాంలో 34 మంది అరెస్ట్.. చెన్నైలో యువకుడి అరెస్ట్