Telangana Students Died: అమెరికాలో ఒకరు మృతి.. జర్మనీలో మరొకరు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోటి ఆశలతో విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్ధులు ప్రమాదాలకు గురై తిరిగిరాని లోకాలకు చేరారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ నెల 7న యూఎస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్ రెడ్డి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళారు. అఖిల్ ఆచూకీ కోసం జర్మన్ రాయబార కార్యాలయానికి కేంద్రం లేఖ రాసింది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా విద్యార్థి క్రాంతి కిరణ్‌రెడ్డి దుర్మరణం పాలయ్యాడు. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్‌రెడ్డి (25) వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 7న స్నేహితులతో కలిసి వెళ్తుండగా, వీరి కారును ఓ కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కిరణ్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయబార కార్యాలయం ద్వారా తెలంగాణ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
Will speak to the authorities in Germany and do our best Rasagnya
My team @KTRoffice will keep you informed on any updates that we will get https://t.co/0BZTIh3Roh
— KTR (@KTRTRS) May 10, 2022
ఈ విషాదం నుంచి తేరుకునేలోపే తెలంగాణకే చెందిన కడారి అఖిల్ (25) అనే యువకుడు జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతయ్యాడు. కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు అఖిల్ 2018లో జర్మనీకి వెళ్లాడు. ఈ నెల 8న ఆయన ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత అఖిల్ కనిపించకుండా పోయాడని సమాచారం అందింది. అతని ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, తన సోదరుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలంటూ అఖిల్ సోదరి మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని కేంద్రానికి తెలిపింది. అఖిల్ గల్లంతు ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ శాఖ బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. ఇద్దరు విద్యార్ధుల ఘటనలు ఆయా కుటుంబాలను కలిచి వేస్తున్నాయి.
Loud Speakers row: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం… లౌడ్ స్పీకర్లపై నిషేధం
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!