Sun will be high: రాష్ట్రంలో ఎక్కువగా ఎండ తీవ్రత.. 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sun will be high: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తడి వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే ఎండలతో పాటు వడగళ్ల వాన కూడా కురుస్తోంది. దీంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన వాంకుతోడు సునీత శుక్రవారం వడదెబ్బతో మృతి చెందిన విషయం తెలిసిందే. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం అత్యధికంగా నల్గొండలో 42.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా హయత్‌నగర్‌లో 25.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైంది.
నిన్న హైదరాబాద్‌లో గరిష్టంగా 37.2, కనిష్టంగా 27.9, ఖమ్మంలో 41.4, కనిష్టంగా 29.0, మెదక్‌లో 40.6, కనిష్టంగా 24.0, నల్గొండలో 42.5, కనిష్టంగా 24.4, నిజామాబాద్‌లో 40.4, కనిష్టంగా 29.0 డిగ్రీలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 41.6, కనిష్టంగా 28.0, హనుమకొండలో 39.0, అత్యల్పంగా 27.5, దుండిగల్‌లో 38.2, అత్యల్పంగా 27.6, హకీంపేటలో 35.2, కనిష్టంగా 26.1, భద్రాచలంలో 39.0, కనిష్టంగా 28.09, ఆదిలాబాద్‌లో 28.09, కనిష్టంగా 2.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. అయితే ఇటీవల కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఎండలు మండుతుండగా.. 29 నుంచి 31 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వనపర్తి, వనపర్తిలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Bridegroom escape: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కొడుకు ఉహించని ట్విస్ట్
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!