పదవ తరగతి అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేశాయ్. రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11.30 గంటలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు www.eenadu.net, www.bse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఆగస్టు 1 నుండి 10వరకు నిర్వహించారు. స్పాట్ వాల్యుయేషన్ తేది 16 నుండి 18వరకు నిర్వహించారు. యస్.యస్.సి. అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు ఆగష్టు 2022 కు 55,663 మంది పరీక్ష వ్రాశారు.
యస్.యస్.సి. అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు ఆగష్టు 2022 పరీక్షలకు మొత్తము 48,167 మంది విద్యార్ధులు హాజరు కాగా వారిలో 38,447 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో పదవ తరగతి అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు ఆగష్టు 2022 విద్యార్థుల ఉత్తీర్ణత 79.82 ఉత్తీర్ణతా శాతం నమోదుకాగా.. బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 78.42, బాలికల ఉత్తీర్ణతా శాతము 82.21. బాలికలు, బాలుర కంటే 3.79% అధికముగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో సిద్దిపేట్ జిల్లా అన్ని జిల్లాల కంటే 97.99 శాతము ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉంది. అదే విధముగా రాష్ట్రములో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 53,11 శాతము సాధించి చివరి స్థానములో ఉంది.
Assam: నెలలు నిండకముందే గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపలపెట్టి కుట్లు