Site icon NTV Telugu

Telangana : క్రీడా రంగానికి మార్గ‌ద‌ర్శిగా తెలంగాణ‌…

దేశ క్రీడా రంగానికి దిక్సూచిగా… ఒలింపిక్స్ ప‌త‌కాల వేట‌కు ఆట మైదానంగా…. భావి క్రీడాకారుల‌కు మార్గ‌ద‌ర్శిగా… ఘ‌న‌మైన గ‌త వార‌స‌త్వపు ప‌రిమ‌ళాల‌ను మ‌రింత‌గా వ్యాపింప‌జేసేందుకు హైద‌రాబాద్ వేదిక కాబోతోంది. ప్ర‌తి క్రీడాకారునిలో ప్ర‌తిభ‌కు మ‌రింత‌గా సాన‌బెట్టి విశ్వ వేదిక‌పై మ‌న క్రీడాకారులు దేశ ప‌తాకాన్ని గ‌ర్వంగా ఎగుర‌వేసేందుకు వీలుగా వారికి అవ‌స‌ర‌మైన వ‌స‌తులు, ప్రోత్సాహాకాలు కల్పించేందుకు తెలంగాణ ప్ర‌జా ప్ర‌భుత్వం క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్ పాల‌సీ) రూపొందించింది. ప్ర‌ముఖ క్రీడాకారుల స‌మ‌క్షంలో   ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ క్రీడా విధానాన్ని శ‌నివారం ఆవిష్క‌రించ‌నున్నారు.

కోటి జ‌నాభా లేని దేశాలు ఒలింపిక్స్‌లో నాలుగైదు బంగారు ప‌త‌కాలు ద‌క్కించుకుంటుంటే వంద కోట్ల పైచిలుకు జ‌నాభా ఉన్న మ‌న దేశం మాత్రం ఒక్క స్వ‌ర్ణ ప‌త‌కం గెలుచుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతోంది.. ద‌శాబ్దాలుగా ప్ర‌భుత్వాలు స‌రైన క్రీడా పాల‌సీని రూపొందించుకోక‌పోవ‌డం… క్రీడాకారులు, కోచ్‌ల‌కు స‌రైన ప్రోత్సాహం క‌ల్పించ‌క‌పోవ‌డం, మౌలిక వ‌స‌తులు లేక‌పోవ‌డంతో ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. దీనిని స‌మూలంగా మార్చేందుకు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కంక‌ణం క‌ట్టుకున్నారు. అందుకే తెలంగాణ స్పోర్ట్స్ పాల‌సీని రూపొందింప‌జేశారు.

 

క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, చ‌ద‌రంగం వంటి క్రీడ‌ల్లో తెలంగాణకు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది.. 2002 నేషనల్ గేమ్స్‌, 2024 ఇంటర్ కాంటినెంటల్ కప్‌ వంటి పెద్ద ఈవెంట్లకు తెలంగాణ‌కు ఆతిథ్య‌మిచ్చింది. ఈ నేప‌థ్యంలో ఈ ఘ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూనే మ‌రింతగా తెలంగాణ ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తంగా చాటేలా నూత‌న పాల‌సీకి రాష్ట్ర ప్ర‌భుత్వం రూప‌క‌ల్ప‌న చేసింది.

ENG vs IND: చెలరేగిన సిరాజ్, ప్రసిద్ కృష్ణ.. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్‌!

అయిదు ప్ర‌ధానాంశాలుగా తెలంగాణ నూత‌న క్రీడా పాల‌సీ రూపొందించారు. అవి.. 1. క్రీడా విధాన నిర్వ‌హ‌ణ‌, 2. క్రీడ రంగంపై సానుకూల‌త పెంచ‌డం, 3. క్రీడాభివృద్ధికి అవ‌స‌ర‌మైన దీర్ఘ‌కాలిక విధానాల రూప‌క్ప‌ల‌న‌, 4. క్రీడ‌ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన మైదానాలు, కోర్టుల అభివృద్ది, 5. క్రీడాకారుల‌ నైపుణ్యాల పెంపున‌కు చ‌ర్య‌లు, వారికి ఉద్యోగ అవ‌కాశాల క‌ల్ప‌న‌..

 

క్రీడా పాల‌సీలో ముఖ్య‌మైన అయిదు అంశాల్లో భాగంగా యంగ్ ఇండియా వ్యాయామ విద్యా, క్రీడా విశ్వ విద్యాల‌యం ఏర్పాటు చేస్తారు. మ‌న క్రీడాకారులు మెరుగ్గా రాణించేందుకు వీలుగా విదేశాల్లోని ప్ర‌ముఖ క్రీడా సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటారు. క్రీడాకారులు, పారా క్రీడాకారుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తారు.

119 నియోజ‌క‌వ‌ర్గాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తారు… ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తారు..  సీఎం క‌ప్ వంటి పోటీలు నిర్వ‌హిస్తారు. ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు గెలిచిన వారికి భారీ బ‌హుమ‌తులు, క్రీడాకారుల‌కు రిజ‌ర్వేష‌న్లు, రిటైర్డ్ క్రీడాకారుల‌కు పింఛ‌న్లు, కోచ్‌ల‌కు మెరుగైన పారితోషికాలు ఇస్తారు.

క్రీడా పాల‌సీ ఏవిధంగా అమ‌ల‌వుతుంది… ఏ విధ‌మైన మార్పులు చేయాల‌నే దానిపై ఏడాది త‌ర్వాత ప్ర‌భుత్వం స‌మీక్షిస్తుంది. ఆ త‌ర్వాత మూడేళ్ల‌కు, అయిదేళ్ల‌కు దానిపైనా స‌మీక్ష ఉంటుంది. డిజిట‌ల్ డాష్‌బోర్డు విధానం ద్వారా ప్ర‌తి ఒక్క‌రూ దానిని వీక్షించే అవ‌కాశం క‌ల్పిస్తారు.

తెలంగాణలో క్రీడా విధానంపై హెచ్ఐసీసీలో ప్ర‌ముఖ క్రీడాకారుల‌తో రెండు స‌ద‌స్సులు నిర్వ‌హిస్తారు.. ఒక స‌దస్సులో ప్ర‌ముఖ క్రీడాకారులు, క్రీడా నిపుణులు పుల్లెల గోపీచంద్‌, గ‌గ‌న్ నారంగ్‌, అంజూ బాబీ జార్జ్‌, సుమ‌తి పాండే, త‌థాగ‌త ముఖ‌ర్జీ, మ‌రో స‌ద‌స్సులో అభిన‌వ్ బింద్రా, ర‌వికాంత్ రెడ్డి, నీలం బాబ‌ర్దేశాయ్‌, అడిల్లె సుమ‌రివాలా పాల్గొంటారు…

Meenakshi Natarajan : మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసమే పనిచేస్తుంది

Exit mobile version