దేశ క్రీడా రంగానికి దిక్సూచిగా… ఒలింపిక్స్ పతకాల వేటకు ఆట మైదానంగా…. భావి క్రీడాకారులకు మార్గదర్శిగా… ఘనమైన గత వారసత్వపు పరిమళాలను మరింతగా వ్యాపింపజేసేందుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. ప్రతి క్రీడాకారునిలో ప్రతిభకు మరింతగా సానబెట్టి విశ్వ వేదికపై మన క్రీడాకారులు దేశ పతాకాన్ని గర్వంగా ఎగురవేసేందుకు వీలుగా వారికి అవసరమైన వసతులు, ప్రోత్సాహాకాలు కల్పించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్ పాలసీ) రూపొందించింది. ప్రముఖ క్రీడాకారుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ…