Telangana Rising Global Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానమంత్రి మోడీ, రాహుల్‌కు ఆహ్వానం..
- స్వయంగా ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- అన్ని రాష్ట్రాల సీఎంలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులకు ఆహ్వానం
- ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని నియమించనున్నారు. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తారు.
ఎవరిని ఆహ్వానించారు.. ఎవరు ఆహ్వానించారు.. వారి రాకను నిర్ధారించడం, వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు ఉన్నతాధికారుల నియామకం అన్నింటిని ఆహ్వాన కమిటీ నిర్ధారించనుంది. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డ్యాష్‌బోర్డ్ ద్వారా సీఎం పర్యవేక్షించనున్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని.. అందులో వెయ్యి మంది ఇప్పటికే తమ రాకను నిర్ధారించారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
Also Read
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
తాజావార్తలు
-
Upcoming Royal Enfield Bikes 2026: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 కొత్త బైక్స్.. హిమాలయన్ 440, 750, GT 750 వచ్చేస్తున్నాయ్!
-
US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
-
Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
-
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
-
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!