Telangaa Rising 2047 Vision Document : విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
- తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
- 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన
- తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్
- 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన
- క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణ
- 2047 నాటికి 3 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీ టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangaa Rising 2047 Vision Document : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బృహత్తరమైన “తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్”ను ఆవిష్కరించారు. 83 పేజీలు కలిగిన ఈ దార్శనిక పత్రానికి “తెలంగాణ మీన్స్ బిజినెస్” అని పేరు పెట్టారు. ఇది రాబోయే రెండు దశాబ్దాలలో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా, సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తుకు మార్గాన్ని సూచిస్తుంది.
ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రూపొందించబడిన ఈ డాక్యుమెంట్ తయారీలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు చోటు కల్పించారు. దీని రూపకల్పనలో NITI Aayog కీలక భూమిక నిర్వహించగా, ISB (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ప్రొఫెసర్లు , వివిధ రంగాల నిపుణుల సలహాలు తీసుకున్నారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
విజన్ 2047 ప్రధాన లక్ష్యాలు : ఈ దార్శనిక పత్రం కేంద్ర లక్ష్యం 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడం.
అంతిమ లక్ష్యం: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం. దీనితో తెలంగాణ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మధ్యంతర మైలురాయి: 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని నిర్దేశించింది.
జాతీయ వాటా లక్ష్యం: 2047 నాటికి జాతీయ GDPలో తెలంగాణ వాటా పదో వంతుకు చేరాలని లక్ష్యం గా ఎంచుకుంది.
3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి డాక్యుమెంట్ మూడు ప్రధాన సూత్రాలను అనుసరిస్తుంది
ఆర్థిక వృద్ధి (Economic Growth): ఆవిష్కరణలు , ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా లక్ష్యాన్ని సాధించడం.
సమ్మిళిత అభివృద్ధి (Inclusive Development): యువత, మహిళలు, రైతులు , అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు సమానంగా అందేలా చూడటం.
సుస్థిర అభివృద్ధి (Sustainable Development): అన్ని రంగాలలో సుస్థిరతను పొందుపరచడం , 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం.
వీటితో పాటు, సాంకేతికత & ఆవిష్కరణ, సమర్థవంతమైన ఆర్థిక వనరులు, సుపరిపాలన అనే మూడు అంశాలు ఈ వృద్ధికి ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయి.
మూడంచెల వ్యూహం: CURE-PURE-RARE జోన్లు
సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తూ, రాష్ట్రంలోని భౌగోళిక ప్రాంతాన్ని మూడు విభిన్న జోన్లుగా విభజించే CURE-PURE-RARE నమూనాను ఈ డాక్యుమెంట్ ప్రతిపాదించింది..
CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ):
ప్రాంతం: 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతం.
దృష్టి: సేవల విస్తరణ, ప్రపంచ స్థాయి నాలెడ్జ్ , ఆవిష్కరణల కేంద్రం, నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందడం.
PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ):
ప్రాంతం: ORR , 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న జోన్.
దృష్టి: తయారీ రంగం కేంద్రంగా, పారిశ్రామిక క్లస్టర్లు , లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటు.
RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ):
ప్రాంతం: RRR దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం.
దృష్టి: వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ , వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి.
పది కీలక వ్యూహాలు
- 3-జోన్ల రాష్ట్రం: సమతుల్య అభివృద్ధికి CURE-PURE-RARE నమూనా అమలు.
- విచక్షణ నుండి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ ,పాలనలో పారదర్శకత కోసం విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.
- గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి బృహత్తర ప్రాజెక్టులు.
- సమర్థ పాలన: డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.
- నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం.
- సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టితో ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో సమాన అవకాశాలు కల్పించడం.
- అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.
- పర్యావరణం , సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం , నెట్-జీరో లక్ష్యం సాధించడం.
- సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు , పర్యాటకాన్ని పరిరక్షించి, ప్రోత్సహించడం.
- ప్రజల భాగస్వామ్యం: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం , వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.
ఈ డాక్యుమెంట్ రాష్ట్ర భవిష్యత్తును ఉజ్జ్వలంగా తీర్చిదిద్దడానికి, పెట్టుబడులకు గమ్యస్థానంగా ,ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి ఒక సమగ్ర రోడ్ మ్యాప్‌ను అందిస్తుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!