Power Demand: తెలంగాణ విద్యుత్ చరిత్రలో నయా రికార్డ్.. 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్..!
- రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు
- అంతరాయం లేకుండా సరఫరా చేసిన ట్రాన్స్‌కో, డిస్కంలు
- పారిశ్రామికాభివృద్ధి, ఎత్తిపోతల పథకాలతో పెరిగిన వినియోగం
- ఏప్రిల్–మేలో 19,000 మెగావాట్లకు చేరే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. 2026, మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 11:01 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల (MW) గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. వేసవి కాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో, ఇంతటి భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఏర్పడినప్పటికీ, ఎక్కడా చిన్నపాటి అంతరాయం కూడా లేకుండా సరఫరాను కొనసాగించి రాష్ట్ర విద్యుత్ సంస్థలు (TSTRANSCO & DISCOMs) తమ కార్యదక్షతను చాటుకున్నాయి. గతేడాది మార్చిలో నమోదైన 15,623 మెగావాట్ల రికార్డును, అలాగే గత నెలలో నమోదైన గణాంకాలను ఈ కొత్త రికార్డు వెనక్కి నెట్టేసింది.
HDFC: కస్టమర్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుండి న్యూ రూల్స్.. లాకర్లు, ATM, UPI రూల్స్ లో మార్పులు..
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణతో పాటు ఎత్తిపోతల పథకాలు (Lift Irrigation) , వ్యవసాయానికి అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సాగు నీటి అవసరాల కోసం రైతాంగం మోటార్లను పెద్ద ఎత్తున వినియోగిస్తుండటం, పట్టణ ప్రాంతాల్లో ఏసీల వాడకం పెరగడం వంటి అంశాలు విద్యుత్ వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చాయి. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైనప్పటికీ, విద్యుత్ డిమాండ్ విషయంలో తెలంగాణ ఇప్పుడు రాజస్థాన్ (20,600 MW), మధ్యప్రదేశ్ (19,900 MW) వంటి పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతోంది. పంజాబ్, హర్యానా వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉండటం ఇక్కడి ఆర్థిక పురోగతికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చారిత్రాత్మక ఘనతపై ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయి డిమాండ్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన ట్రాన్స్‌కో, జెన్కో అధికారులను , సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం ఎంతటి భారీ డిమాండ్‌నైనా తట్టుకునేలా సబ్-స్టేషన్ల పటిష్ఠత, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ 19,000 మెగావాట్లను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, దానికి తగినట్లుగా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’తో ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
India Oil Supply: చమురు కొరతను ఖండించిన ప్రభుత్వ వర్గాలు.. బిగ్ రిలీఫ్..!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!