తెలంగాణలో భానుడి భగభగలకు తోడు వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పులు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న తరుణంలో, రానున్న రెండు గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, , మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం వేళ అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్న ప్రజలకు వాతావరణ నిపుణులు షాకింగ్ న్యూస్ చెప్పారు.
Vivo Y600 Pro: వివో వై600 ప్రో.. 10,000mAh బ్యాటరీ, స్టైలిష్ డిజైన్ తో వచ్చేస్తోంది
ప్రస్తుతం కురిసే ఈ వర్షాలు కేవలం గాలిలో తేమను పెంచేవి మాత్రమేనని, దీనివల్ల కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత ఏమాత్రం తగ్గదని స్పష్టం చేస్తున్నారు. వర్షం కురిసిన తర్వాత గాలిలో హ్యూమిడిటీ (తేమ శాతం) ఒక్కసారిగా పెరగడం వల్ల ఉక్కపోత మరింత తీవ్రమై ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యే ప్రమాదం ఉంది. అంటే, ఈ వర్షం ఎండ వేడి నుంచి ఏమాత్రం ఉపశమనం కలిగించకపోగా, వాతావరణాన్ని మరింత ఉక్కపోతగా మారుస్తుంది. ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
