Site icon NTV Telugu

Bandi Sanjay: బండి సంజయ్‌కి షాకిచ్చిన పోలీసులు.. రెండు రోజులకే..!

Bandi Sanjay

Bandi Sanjay

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు షాకిచ్చారు పోలీసులు.. అదనపు భద్రతను కేటాయించి.. ఆ వెంటనే వెనక్కి తీసుకోవడం చర్చగా మారింది.. అగ్నిపథ్ స్కీమ్‌పై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ పరధిలో.. ఇటీవల బండి సంజయ్​భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రస్తుతం ఉన్న భద్రతతో పాటు అదనంగా (1+5) రోప్ పార్టీ, ఎస్కార్ట్ వాహనం కూడా ఇచ్చారు.. అయితే, ఈ నిర్ణయం తీసుకున్న రెండు రోజుల తర్వాత మళ్లీ వెనక్కి తీసుకున్నారు. దీంతో.. ఆయనకు పోలీసులు షాకిచ్చినట్టు అయ్యింది..

Read Also: Power star : పవన్ కళ్యాణ్, సముతిర కని చిత్రం పూజతో ప్రారంభం!

ఇక, ఏ విషయంలోనైనా బీజేపీ, టీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంటుంది.. దీనిపై కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. టీఆర్ఎస్‌ ప్రభుత్వ ఒత్తిడితోనే బండి సంజయ్​కి ఇచ్చిన అదనపు భద్రతను వెనక్కి తీసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు.. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరిగాయి.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసమే జరిగింది.. అయితే, అగ్నిపథ్​ పథకం, ఆందోళనలపై బండి సంజయ్​చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచిన పోలీసులు.. మళ్లీ వెనక్కి తీసుకున్నారు.

Exit mobile version