తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. టి.పీసీసీ అనుబంధ సంఘాల నేతలకు దిశా నిర్దేశం చేశారు రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.. ఇక, పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరం సహచరులమేనని స్పష్టం చేశారు.. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రల నుంచి అప్రమత్తంగా ఉండకపోతే కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు.. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన పీసీసీ చీఫ్.. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది.. అనుబంధ సంఘాలు అప్రమత్తంగా వ్యవహరించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
Read Also: Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి.. పీఎస్ కుమారుడి ఆత్మహత్య.. అదే కారణమా…?
గాంధీ భవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అనుబంధ సంఘాల చైర్మన్ లు, అధ్యక్షులతో సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్స్ జగ్గారెడ్డి, అజారుద్దీన్, కోదండ రెడ్డి, మల్లు రవి తదితరలు పాల్గొన్నారు.. ఈ సమావేశంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కాగా, తాజాగా జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ సారి బీజేపీ నుంచి పోటీచేశారు.. అయితే, ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో.. ఆ పార్టీ బరిలోకి దింపిన పాల్వాయి స్రవంతి.. మూడోస్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే.. సిట్టింగ్ స్థానంలో గట్టిపోటా ఇవ్వడం తర్వాత విషయం.. మూడోస్థానానికి పరిమితం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
