మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోలుకు కోసం జరిగిన డీలింగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… బీజేపీపై ఛార్జిషీట్ విడుదల చేశారు.. 1. నీతి ఆయోగ్ చెప్పినా ఫ్లోరైడ్ నివారణకు నిధులు ఇవ్వలేదు, 2016లో జేపీ నడ్డా చెప్పిన ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఇవ్వలేదు, 2. చేనేతపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని నరేంద్ర మోడీడీ, నూలు సబ్సిడీ తగ్గింపు, ఖాదీ బోర్డ్ రద్దు, 3. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, 4. నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం, 5. గ్యాస్ ధర పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు లాంటి అంశాలను చార్జిషీట్‌లో పేర్కొన్నారు.. అయితే, ఈ సందర్భంగా మీడియా నుంచి కేటీఆర్‌కు ఎమ్మెల్యేల డీల్ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. నేను కేవలం చార్జిషీట్‌పైనే మాట్లాడుదాం అనుకుంటే.. నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నారంటూ.. మొత్తంగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్..
Read Also: TRS vs BJP : బీజేపీ పై టీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.. దానిపై ఇప్పుడు మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నారని అంటారన్నారు మంత్రి కేటీఆర్.. ఈ వ్యవహారంపై సందర్భాన్ని బట్టి సీఎం కేసీఆర్ మాట్లాడతారని తెలిపిన ఆయన.. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. ఇక, దొంగ ఎవరు… దొర ఎవరో తెలిసిపోయింది.. ప్రజల ముందుకు అన్నీ వచ్చాయని గుర్తుచేశారు. బండి సంజయ్ ప్రమాణం చేయడంపై హాట్ కామెంట్లు చేశారు కేటీఆర్… ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే పోలీసులు, కోర్టులు అవసరం ఉండదన్న ఆయన.. బండి సంజయ్ ప్రమాణాలు చేస్తే కోర్టులు ఎందుకు ? అంటూ ప్రశ్నించారు.. ఇదే సమయంలో.. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్.. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని తాకారు.. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి… యాదాద్రి టెంపుల్ అధికారులను నేను కోరుతున్నాను.. లక్ష్మి నరసింహస్వామికి సంప్రోక్షణ చేసి.. భక్తుల మనోభావాలను గౌరించాలని పేర్కొన్నారు.. ఇంకా.. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..