మలపూర్ లో నిర్వహించిన సమావేశంలో తీవ్ర పదజాలం వాడారు. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. కన్నెర్ర జేస్తేనే టిఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి ని మాత్రమే ప్రజలకు వివరిస్తుంది. నాయకులను ప్రలోభాలు పెట్టలని చూస్తున్నావు ఈటల. గతంలో చేసిన అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతున్నా. ఎకరం అమ్మితే ఎలక్షన్ కొడతా అన్నావు, ప్రజాబలం ఉంటే ఇంత నీచంగా ఎందుకు దిగజారారు. కుట్టుమిషన్లు ఛత్రిలు బొట్టుబిల్లలు పంచుతున్నారు.70 రూపాయల గడియరాన్ని చూసి ఎలా ఓటు వేస్తారు అని అడిగారు.
అలాగే కట్టు బానిసలు అన్న పదానికి అర్థం ఏమిటి. గత 17 సంవత్సరాలు గా ఉన్న నువ్వు బానిసవి కాదా అని ప్రశ్నించారు. తెరాస ఒక ఉద్యమ పార్టీ, ఆనాడు ఉద్యమం ఈనాడు అభివృద్ధి విషయంలో పోటీ పడుతున్నారు. కేసీఆర్, హరీష్ రావు అనేముందు ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలి. డిప్యూటీ స్పీకర్ పదవిని త్యాగం చేశారు. బెదిరింపులకు గురి చేయట్లేదు, జమ్మికుంటలో గత 2 సార్లు మంత్రిగా ఉన్న అభివృద్ధి జరగలేదు ఇప్పటికే 50 కోట్లు ఇచ్చాము. ఇంకా50 కోట్లు ఇవ్వడానికి సిద్ధం. 20సంవత్సరాలు గా ఉద్యమంలో కలిసి పనిచేశాము.అయినా నిన్ను దుర్భాశలడలేదు.. ఈటల అడుతున్నాడు. ఎన్నికలు ఎన్నికలలాగేనే చూడాలి.బీజేపీ లో నీకు పట్టింపు లేదు.విలువలు తగ్గించుకోకూడదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.దళిత ఎమ్యెల్యేని దద్దమ్మ అనడం సబబు కాదు. అందరూ వదిలి వెళ్లిపోతుంటే మీరు ఇష్టానుసారంగా మాట్లాడ్డం తగదు. రాజకీయాలల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. తప్పుడు మాటలు మాట్లాడవద్దు అని హెచ్చరించారు.