Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
- తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి కీలక అడుగు
- 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
- మే 22, 23న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ
- హాజరు కాలేనివారికి మే 25న మరో అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. మొత్తం 433 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3 నిష్పత్తిలో) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.
ఎంపికైన అభ్యర్థులందరికీ హైదరాబాద్ వెంగల్రావు నగర్లో ఉన్న ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ (IIHFW) ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అభ్యర్థులు తమ విద్యార్హత, కమ్యునిటీ (కుల ధృవీకరణ) తో పాటు అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఏవైనా అనివార్య కారణాల వల్ల ఈ నెల 22, 23వ తేదీల్లో హాజరు కాలేని అభ్యర్థులకు బోర్డు మరో సువర్ణ అవకాశం కల్పించింది. అలాంటి వారు ఈ నెల 25వ తేదీన వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేసి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చునని బోర్డు పేర్కొంది.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం 34 విభాగాల్లో (డిపార్ట్మెంట్లలో) 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం ఖాళీలలో పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనస్తేషియా వంటి అత్యంత కీలక విభాగాల్లోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. ఈ పోస్టులకు ఎంపికైన వైద్యులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ఇటీవలే నియామక పత్రాలను (అపాయింట్మెంట్ ఆర్డర్స్) కూడా అందజేశారు.
తాజాగా మిగిలిన 30 డిపార్ట్మెంట్లలో ఉన్న 433 పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను ఇప్పుడు విడుదల చేశారు. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఉద్యోగాలకు తుది ఎంపికైన డాక్టర్ల పూర్తి అధికారిక జాబితాను విడుదల చేస్తామని రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. దీనివల్ల మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీరి, రోగులకు వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి.
తాజావార్తలు
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?