Telangana Assembly: తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు నిన్న (శనివారం)తో ముగిసింది. ఫిబ్రవరి 8వ తేదీన తమిళసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ ఫిబ్రవరి 17 వరకు కొనసాగాయి. అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు వాడివేడి చర్చలు జరిగాయి. ఇక చివరి రోజైన శనివారం సాగునీటి రంగంపై శ్వేత పత్రం విడుదల, దానిపై చర్చ కొనసాగింది. హాట్ హాట్ గా కొనసాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి 8.20 గంటల సమయంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Read also: Anjana Bhowmik Death: చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్ హీరోయిన్ మృతి!
ఈ నెల 8న ప్రారంభమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఎనిమిది రోజుల పాటు సాగాయి. తొలిరోజు (8వ తేదీ) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సాయి సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ధన్యవాద తీర్మానం 9వ తేదీన చర్చకు వచ్చింది. మూడో రోజు (10వ తేదీ) రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ ఖాతా బడ్జెట్‌ను సభలో ప్రతిపాదించింది. మరుసటి రోజు ఆదివారం అసెంబ్లీకి సెలవు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఓటాన్ ఖాతా బడ్జెట్ ప్రతిపాదన, ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించకూడదని తీర్మానం, కుల గణనపై తీర్మానం, నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం వంటి అంశాలను హైలైట్ చేశారు.
Read also: MRO Ramanaiah: హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య ఇంట్లో మరో విషాదం
పలు సందర్భాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. మాటల తూటాలు పేలాయి. బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్, టీ.హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. మొత్తం 8 రోజుల శాసనసభ సమావేశాల్లో 59 మంది ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మాట్లాడారు. దాదాపు 45 గంటల పాటు సమావేశం కొనసాగింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని కుల గణనపై మరో తీర్మానం చేశారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశాల్లో మరో 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Popcorn : పాప్‌కార్న్ ఇష్టంగా తింటున్నారా.. మీకు పోయే కాలం దగ్గరపడ్డట్టే