Uttam Kumar Reddy : రేపు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల పంట ప్రొక్యూర్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 52 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్‌మెంట్‌కే కేంద్రం అనుమతి కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిగిలిన ధాన్యం ప్రొక్యూర్‌మెంట్‌కు కూడా అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాముల్లో, రైస్ మిల్లుల్లో ధాన్యం నిండిపోయి ఉందని, ధాన్యం తరలింపుకు 300 టైన్స్ ఇవ్వాని విజ్ఞప్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. సాగునీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికే ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చెరువులు, కాలువల నిర్వహణలో రైతుల భాగస్వామ్యం ఉండేలా ఈ సంఘాలు ఏర్పాటు చేస్తామని, మొదట చిన్నస్థాయి చెరువుల వద్ద మొదలు పెట్టి, తరువాత పెద్ద ప్రాజెక్టుల వరకూ విస్తరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.
Janhvi Kapoor : పిచ్చెక్కిపోయే అందాలతో జాన్వీ కపూర్ అరాచకం
ప్రతి వినియోగదారుల సంఘానికి నీటిపారుదలశాఖ నుంచి ఒక అధికారి కన్వీనర్‌గా నియమించనున్నట్లు వెల్లడించారు. రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్, సభ్యులతో చర్చలు జరిపిన తర్వాతే సంఘాల ఏర్పాటు జరుగుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ నేత కోదండరెడ్డి కూడా ఇలాంటి సంఘాల ఏర్పాటు కోసం పట్టుదలగా పోరాడారని గుర్తు చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని, రాష్ట్ర హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని చెప్పారు. ఈ వ్యవహారంలో సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను నియమించి, ప్రత్యేక లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా తుమ్మిడిహట్టి ఆనకట్టకు సంబంధించి సవరణలతో డీపీఆర్ సిద్ధం చేసి, కేబినెట్ ఆమోదం పొందిన తరువాత ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించబోతోందని వివరించారు.