IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
- హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా శిఖా గోయల్ బదిలీ
- విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా దేవేంద్ర సింగ్ చౌహాన్ నియామకం
- మల్టీజోన్-2 ఐజీపీగా షానవాజ్ ఖాసిం బదిలీ
- ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా డా. తరుణ్ జోషి
- డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాష్ మొహంతి బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంలో కీలకమైన మార్పులు చేస్తూ ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా సీనియర్ అధికారిణి శిఖా గోయల్‌కు హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత బాధ్యతలు అప్పగించగా, దేవేంద్ర సింగ్ చౌహాన్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా నియమితులయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ తరుణ్ జోషిని ఎంపిక చేశారు. ఈ స్థానంలో ఉన్న సుధీర్ బాబు పదవీ విరమణ చేయడంతో తరుణ్ జోషిని అక్కడ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాష్ మొహంతిని బదిలీ చేసింది. అదేవిధంగా, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి. సుమతిని నియమించగా, మల్టీజోన్-2 ఐజీపీగా షానవాజ్ ఖాసిం బాధ్యతలు చేపట్టనున్నారు. ఐజీపీ కార్తికేయకు తన ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎస్ఐబీ (SIB) ఇంటెలిజెన్స్ అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. రాష్ట్ర పరిపాలనలో వేగం పెంచడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నియామకాలను చేపట్టింది.
తాజావార్తలు
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!