Inspiration :HEC వైపు అడుగులు.. స్టేట్ ర్యాంకులతో గిరిజన బిడ్డ హర్ష సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్మీడియట్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి MPC, BiPC గ్రూపులే. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెజారిటీ విద్యార్థులు ఈ కోర్సుల వైపు పరుగులు తీస్తుంటారు. ఈ క్రమంలో HEC, CEC గ్రూపులకు ఆదరణ తగ్గిపోతున్న తరుణంలో, ఒక గిరిజన విద్యార్థి తన స్పష్టమైన లక్ష్యంతో అందరి కళ్లు తెరిపించాడు. పదవ తరగతిలో 500కు పైగా స్కోరు సాధించిన ఏ విద్యార్థి అయినా సహజంగానే కార్పొరేట్ కాలేజీల వైపు చూస్తారు. కానీ, హర్ష మాత్రం తన లక్ష్యం పట్ల ఉన్న స్పష్టతతో గురుకుల కాలేజీని వెతుక్కుంటూ వచ్చాడు. తనకి HEC (History, Economics, Civics) గ్రూపులో సీటు కావాలని అడిగినప్పుడు, అక్కడి లెక్చరర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇంత మంచి మార్కులు వచ్చిన అబ్బాయి వారం రోజుల్లో మనసు మార్చుకుని మళ్ళీ MPCకో, BiPCకో వెళ్తాడని అందరూ అనుకున్నా కానీ, హర్ష ఆ అంచనాలను తలకిందులు చేశాడు.
Also Read:Sudheer- Deepika Pilli : వెకేషన్లో సుధీర్ – దీపికా.. సీక్రెట్ లవ్ బట్టబయలు?
Also Read
- Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
తరగతి గదిలో పాఠాలను వినడమే కాదు, వాటి లోతుపాతులను చర్చించడంలో హర్షది ప్రత్యేక శైలి. అతని ఆసక్తిని, సబ్జెక్టుపై ఉన్న పట్టును చూసి CEC లో జాయిన్ అయిన మరో ఐదుగురు విద్యార్థులు తమ గ్రూపును HECకి మార్చుకున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే, సెల్ఫ్ ప్రిపరేషన్ మరియు గ్రూప్ డిస్కషన్స్‌తో ఆడుతూ పాడుతూ చదువును సాగించాడు. ఫలితంగా తాజాగా విడుదలైన 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో 492/500 మార్కులు సాధించి స్టేట్ 2nd ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. హర్ష సాధించిన విజయం ఒక ఎత్తు అయితే, అతడిని చూసి గ్రూపు మార్చుకున్న ఆ ఐదుగురు విద్యార్థులలో ముగ్గురు 430+ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. సామాన్య విద్యార్థులను స్టేట్ లెవల్ ర్యాంకర్ల స్థాయికి చేర్చడంలో ‘మంచి స్నేహం’ ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో ఈ ఘటనే నిదర్శనం. ప్రభుత్వ కాలేజీలు అంటే కేవలం పాస్ మార్కులకే పరిమితం అనే అపోహను ఈ విద్యార్థులు పటాపంచలు చేస్తున్నారు. గతేడాది (2025) ఇంటర్ ఫలితాల్లో ఇదే కాలేజీకి చెందిన ఫర్హాన్ అనే విద్యార్థి CEC 495/500 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది గిరిజన తెగకు చెందిన హర్ష స్టేట్ 2nd ర్యాంక్‌తో ఆ వారసత్వాన్ని కొనసాగించాడు. సివిల్స్ సాధించాలనే బలమైన సంకల్పంతో, ఇంటర్మీడియట్ లోనే ఇంతటి పరిణితిని హర్ష ప్రదర్శించడం గర్వకారణం.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్‌ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!