Telangana Inter Exams : విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్ వచ్చేసింది..!
- ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు
- విద్యార్థుల పోటీ పరీక్షల సిద్ధతకు అవకాశం
- 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు
- నవంబర్ 11 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి ఇంటర్ పరీక్షలు మామూలుగా మార్చిలో కాకుండా ముందుగానే ఫిబ్రవరిలోనే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), NEET వంటి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఎక్కువ సమయం దొరకడం. ఈ మార్పుతో విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం అదనపు సమయం లభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో మార్పులు అమలుకానున్నాయి. గణితం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం వంటి ముఖ్యమైన సబ్జెక్టుల్లో కొత్త కాన్సెప్ట్స్ చేర్చబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఇప్పటివరకు కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలు ఉండగా, ఈసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ల్యాబ్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
జనవరి 21న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష, జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్ రాత పరీక్షలు, ఫిబ్రవరి 26 నుంచి సెకండ్ ఇయర్ రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనున్నాయి.
పరీక్ష ఫీజుల చెల్లింపు ప్రక్రియ నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆన్లైన్ ద్వారా కొనసాగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు గడువులోపు ఫీజులు చెల్లించి తమ హాల్‌టికెట్లు పొందాలని సూచించింది. ఈసారి విడుదలైన షెడ్యూల్ వల్ల విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత సమర్థవంతంగా సిద్ధం కావడానికి అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!