Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
- పలువురు IFS అధికారుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- అరణ్య భవన్లో వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్‌కు కీలక బాధ్యతలు
- పలు జిల్లాలకు కొత్త డీఎఫ్‌వోల నియామకం
- ఆదిలాబాద్ డీఎఫ్‌వోగా చిన్న విశ్వనాథ్‌కు అదనపు బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా పరమైన కారణాలతో పలువురు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు (G.O.Rt.No.932) అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు అందరూ తక్షణమే తమ పాత విధులను వదిలి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
అరణ్య భవన్‌కు వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్
ప్రస్తుతం పోస్టింగ్ కోసం నిరిక్షిస్తున్న వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్, IFSకు ప్రభుత్వం అరణ్య భవన్లో కీలక బాధ్యతలు అప్పగించింది . హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (HoFF) కార్యాలయంలో ఆయనను కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ప్లానింగ్ అండ్ విజిలెన్స్) గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
- CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
జిల్లాల అటవీ అధికారుల (DFO) మార్పులు
రాష్ట్రంలోని పలు జిల్లాలకు కొత్త అటవీ అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం బదిలీల జాబితాను విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారిగా ఉన్న జి. కిష్ట గౌడ్, IFS జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారిగా బదిలీ కాగా, ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, IFS ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారిగా నియమించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, IFS ను రంగారెడ్డి జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేయగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ అధికారిగా ఉన్న ఎం. నవీన్ రెడ్డి, IFSను మహబూబ్‌నగర్ జిల్లా అటవీ అధికారిగా నియమించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, IFS ను నిజామాబాద్ జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ డీఎఫ్ఓగా చిన్న విశ్వనాథ్‌కు అదనపు బాధ్యతలు
జిల్లాల అధికారుల మార్పులతో పాటు ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్న చిన్న విశ్వనాథ్ భూసారెడ్డి, IFSకి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమె తన ప్రస్తుత విధులను కొనసాగిస్తూనే, ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి (DFO) గా పూర్తి అదనపు బాధ్యతలను (FAC) నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
-
Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!