Telangana : రూ.67,500కి ఒకే ఒక్క గజం.. హైదరాబాద్ శివార్లలో ఏం జరుగుతోంది?
- తొర్రూర్‌లో రియల్ ఎస్టేట్ చరిత్రలో రికార్డు ధర
- కార్నర్ ప్లాట్‌పై తీవ్ర పోటీ.. రూ.67,500కి విక్రయం
- 100 ప్లాట్ల వేలం – రూ.105 కోట్ల ఆదాయం
- భారీ బందోబస్తుతో రోజు పొడవునా వేలం నిర్వహణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని తొర్రూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డు ధరలను తాకింది. అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలంలో చదరపు గజం భూమి ధర రూ.67,500 పలికింది. మధ్యతరగతి కుటుంబాలకు అనువైన 300 నుంచి 450 గజాల విస్తీర్ణంలోని 100 ప్లాట్ల వేలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. ఈ వేలంలో 240 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. చదరపు గజానికి కనీస ధర రూ.25,000గా నిర్ణయించగా, ఒక కార్నర్ ప్లాట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ప్లాట్‌ను చివరకు రూ.67,500కి విక్రయించారు.
Mohan Bhagwat: విద్య, ఆరోగ్యం సామాన్యుడికి దూరమయ్యాయి. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Also Read
ఈ లేఅవుట్లో మొత్తం 24 కార్నర్ ప్లాట్లు ఉన్నాయి. మరో ప్లాట్ ధర చదరపు గజానికి రూ.62,000 పలికింది. ఈ వంద ప్లాట్ల సగటు ధర రూ.33,000గా నమోదైంది. ఈ విక్రయాల ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సుమారు రూ.105 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలం ప్రక్రియ ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు భారీ పోలీసు బందోబస్తు, రెవెన్యూ, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండిఎ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి వచ్చి, తమకు నచ్చిన ప్లాట్లను సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు.
Elumalai Movie: ‘ఏలుమలై’ సినిమా నుంచి కొత్త పాట.. ‘కాపాడు దేవా’ అంటున్న మంగ్లీ
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!