Telangana: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభమైన తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడింది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించడంపై నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ల ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ తీర్మానం పెట్టడం.. దానికి స్పీకర్ అంగీకరించడం జరిగిపోయాయి. అయితే, దీనిపై న్యాయపోరాటానికి దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు.. తమ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
Read Also: Education: విద్యాశాఖపై సీఎం కీలక సమీక్ష..
Also Read
రాజ్యాంగ విరుద్ధంగా తమను సస్పెండ్ చేశారంటూ రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు.. అయితే, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదంటూ కోర్టును కోరారు అడ్వొకేట్ జనరల్… ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు.. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరి హైకోర్టుకు అసెంబ్లీ కార్యదర్శి ఎలాంటి సమాధానం ఇస్తారు.. రేపటి విచారణ ఎలా జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బీజేపీ శాసన సభ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం.. హైకోర్టుకు చేరడం.. కోర్టు నోటీసులు జారీ చేయడం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!