Telangan High Court: బీజేపీకి ఎదురుదెబ్బ.. ఫాంహౌస్ నిందితుల విచారణకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court Lifted Stay On Moinabad Episode Case: మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కి కొన్ని రోజుల ముందు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా.. ఫాంహౌస్‌లోనే వాళ్లను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు.. ఇప్పుడు ఆ స్టేను ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు నిందితులపై దర్యాప్తు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. నిందితుల పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కూడా తీర్పునిచ్చింది. అలాగే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టిన హైకోర్టు, తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
కాగా.. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లుగా గుర్తించగా విషయం విదితమే! ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగానే పోలీసులకు సమాచారం అందించగా.. ఫాంహౌస్‌లో చర్చలు జరుపుతున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి, ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. తొలుత వీరి కస్టడీకి ఏసీబీ కోర్టు నిరాకరించడంతో.. పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు నిందితుల రిమాండ్‌కి హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది కానీ.. కేసు దర్యాప్తుపై మాత్రం స్టే విధించింది. ఇప్పుడు తాజాగా ఆ స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో.. ఆ ముగ్గురు వ్యక్తులు బీజేపీకి చెందిన వారిగా అర్థమవుతోంది. పలుసార్లు ఆ వ్యక్తులు అమిత్ షాతో పాటు జేపీ నడ్డా పేర్లను కూడా ప్రస్తావించారు. తాజా కోర్టు తీర్పు.. బీజేపీ పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
తాజావార్తలు
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!