తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదన్న కోర్టు.. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని మండిపడింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదికలో సరైన సమాధానంలేదని వ్యాఖ్యానించింది.. ఇక, రేపు జరిగే విచారణకు.. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ.. అందరూ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారుకులు ఇన్‌పెక్షన్ వచ్చిదని గుర్తుచేసిన న్యాయస్థానం.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకేళా ఉండాలన్న ఆదేశాలను అమలు చేశారని అని ప్రశ్నించింది. అలాగే ఎవరివైతే లెసెన్స్‌లు రద్దు చేశారో.. వారినుంచి కరోనా రోగులకు డబ్బులు తిరిగి ఇప్పించారా? అని ప్రశ్నించింది.. రేపటి విచారణకు హెల్త్ సెక్రటరీ, డీజీపీ సహా అందరూ హాజరుకావాలని ఆదేశించింది..
ఇక, థర్డ్ వేవ్‌కు ప్రభుత్వం ఎలా సన్నద్ధం అవుతోంది? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. దీనిపై వివరాలు లేవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ దశగా మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? అని ప్రశ్నించింది.. నిలోఫర్‌లో 200 పడకలు ఏర్పాటు చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించింది.. అసలు, కోవిడ్ థర్డ్ వేవ్ కట్టడికి ఎలా సన్నద్ధం అవుతున్నారని నిలదీసింది.. మే 17న విచారణలో చాలా ప్రశ్నలు లేవనెత్తింది హైకోర్టు.. వాటిపై సమాధానాలు ఇవ్వాలని కోరింది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రేట్లను నిర్ణయిస్తూ కొత్త జీవో విడుదల చేయాలని కోరింది.. కానీ, జీవో విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన చాలా ఆదేశాలు పాటించలేదు.. కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించింది.