కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…
రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు, కోవిడ్ థర్డ్‌వేవ్ సన్నద్ధత, హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివరించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామన్నారు.. ఆక్సిజన్ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.. అలాగే…
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, డీజీపీ, పౌరసరఫరాల శాఖ నివేదికపై వాదనలు జరిగాయి. హెల్త్ సెక్రటరీ రిజ్వీ కూడా హైకోర్టుకు హాజరయ్యారు. లాక్‌డౌన్ సడలింపుల గురించి వైద్యశాఖ కోర్టుకు వివరించింది. కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువ ఉన్నందున.. అధికారులను అప్రమత్తం చేశామని తెలిపింది. థర్డ్‌వేవ్ చర్యలపైనా కేబినెట్ చర్చించిందని కోర్టుకు చెప్పింది వైద్యశాఖ. బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేషన్ సదుపాయాలపైనా చర్చించారని తెలిపింది. అయితే గతంలో ప్రైవేట్ ఆస్పత్రులకు జీవో ఇవ్వాలని చెప్పినా… ఎందుకు…
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదన్న కోర్టు.. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని మండిపడింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదికలో సరైన సమాధానంలేదని వ్యాఖ్యానించింది.. ఇక, రేపు జరిగే విచారణకు.. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ.. అందరూ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 8 వేల…