Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud: తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో షాక్ ఇచ్చింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలన్న మంత్రి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మంత్రిపై మహబూబ్ నగర్ ఓటరు రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు అనుమతి లభించింది. ఎన్నికల అఫిడవిట్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మంత్రి వాదనను తోసిపుచ్చి రాఘవేంద్రరాజు పిటిషన్‌పై విచారణకు అనుమతించింది.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చారు. వనమా విజయంపై జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే..
1969 Postcard: 1969లో పంపిన పోస్ట్‌కార్డ్ ఇప్పుడు డెలివరీ.. మొదటి లైను చదవగానే షాక్
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!