Srinivas Goud: తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో షాక్ ఇచ్చింది. తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలన్న మంత్రి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూములు ఇష్టానుసారంగా అనర్హులకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో రోజు రోజుకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జల్సాల కోసం మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడుపుతూ ఎంతో మంది జీవితాలను బలిగొంటున్నారు. కుటుంబాలకు పెద్దదిక్కైన వారు ప్రమాదాల్లో చిక్కుకోవడంతో వారినే నమ్ముకున్న వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అయితే డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు, ఎక్సైజ్, వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా…
నేడు క్రీడా దినోత్సవం సందర్బంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓయూలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరైయ్యారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మరో ఇరువై ఏళ్ళు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అలాగే…
తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం క్యాంపస్ కి వెళ్లారు. ఈ సందర్బంలో విద్యార్థులు మంత్రికి అడ్డుగా వచ్చి గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తంచేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ హామీలు ఏమైయ్యాయంటూ నిలదీశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మంత్రి క్యాంపస్…