NTV Telugu Site icon

Harish Rao: వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించింది

Harish Rao Brs

Harish Rao Brs

Harish Rao: వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ముఖ్య అతిథిగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్, ఆర్బీఐ, బ్యాంకర్లు.. హాజరయ్యారు. 2023-24 స్టేట్ ఫోకస్ పేపర్ ను మంత్రి హరీష్ విడుదల చేసారు. నాబార్డు సహకారంతో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు చేశామన్నారు. గోడౌన్ ల నిర్మాణానికి నాబార్డ్ ఎంతో సహాయం చేసిందని తెలిపారు. గత ఏడు ఏళ్లలో తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. వరి ధాన్యం ఉత్పత్తి 5 రెట్లు పెరిగిందని అన్నారు. నాబార్డు, తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయని పేర్కొన్నారు.

Read also: OTR about Ganta Srinivasa Rao: ‘అమ్మో గంటా’..! దూరం జరుగుతున్న నేతలు.. ఆ పేరు చెబితే నేతల ఉలికిపాటు

బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్ట్ ల నిర్మాణానికి సహకరించాలని నాబార్డ్ ను కోరుతున్నామన్నారు. తెలంగాణ రోల్ మోడల్ అని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ ను కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరుతో దేశ వ్యాప్తంగా చేపడుతుందని తెలిపారు. రైతు బందు కూడా ఆదర్శం… ఇప్పటికీ 9 సార్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈనెల 28 నుండి 10 వ ఇన్స్టాల్ మెంట్ ఇవ్వబోతున్నామని తెలిపారు మంత్రి. మా ఆర్థిక వనరుల మీద ప్రభావం పడ్డడం, FRBM లో కేంద్రం కోత పెట్టిన రైతు బంధు ఆపలేదన్నారు. ఉచిత కరెంట్ వల్ల 18 వేల కోట్ల సబ్సిడీ ఒక్కో రైతు కు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ gsdp లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సెక్టార్ ల భాగస్వామ్యం 19 శాతం అని తెలిపారు. వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని అన్నారు. వ్యవసాయ రంగం లో సాంకేతికత ను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతుల కోసం ఎంతో చేసిన ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం కేసీఆర్‌ చెబుతారన్నారు. రైతు ఆదాయం డబుల్ కావాలని అనేది నినాదంగా కాకుండా నిజం కావాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Omicron BF7: కరోనా విజృంభనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన