Panchayat Raj Act : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధులపై కొత్త రూల్
- పంచాయతీలకు సొంత ఆదాయంపై అధికారం
- నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నిధులు
- ప్రభుత్వ ఖజానా ద్వారా మళ్లింపునకు చెక్
- గ్రామాల్లో అభివృద్ధి పనులకు వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ స్థాయి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకున్న ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ఖజానా ద్వారా మళ్లించాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ పంచాయతీ రాజ్ (నాల్గవ సవరణ) చట్టం, 2026ను అక్టోబర్ 9, 2026 నుండి అమలులోకి తెస్తూ జీవో ఎంఎస్ నెం. 43ను జారీ చేసింది. ప్రభుత్వ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.
నిధుల విడుదలలో జాప్యానికి చెక్
గతంలో గ్రామ పంచాయతీలు వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకున్న సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసి, ఆ తర్వాత నిధులను పొందాల్సి వచ్చేది. ఈ సంక్లిష్టమైన విధానం వల్ల గ్రామాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంలో తీవ్రమైన జాప్యం జరిగేది. ఫలితంగా పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రహదారుల మరమ్మతులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో గ్రామ పంచాయతీలు తరచూ ఇబ్బందులను ఎదుర్కొనేవి. స్థానిక సంస్థల ఆర్థిక స్వయంప్రతిపత్తికి ఈ విధానం కొంత అడ్డంకిగా మారడంతో, ప్రభుత్వం ఈ శాసన సవరణను తీసుకువచ్చింది.
Also Read
- Poker Night Busted : దీపావళి వేళ.. పేకాట ఆడుతూ దొరికిన మహిళా వ్యాపారవేత్తలు..
- Paytm Diwali Gift Scam: పేటీఎం పేరుతో రూ.1,000 ఎర.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
- Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం 'రేవంత్ రెడ్డి' చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
- Telangana PG Medical Seats : తెలంగాణలో పీజీ సీట్ల జాతర.. ఒకేసారి 359 పెంపు
వేగవంతం కానున్న స్థానిక అభివృద్ధి పనులు
ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుండటంతో, స్థానిక సర్పంచ్‌లు లేదా పాలకవర్గాలు ఆ ఆదాయాన్ని ఎవరి అనుమతి కోసం ఎదురుచూడకుండా తక్షణమే వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ప్రజల తక్షణ స్థానిక అవసరాలను ఇట్టే తీర్చడానికి ఈ సంస్కరణ ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. నిధుల కొరత లేదా సాంకేతిక జాప్యం లేకుండా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులు శరవేగంగా ముందుకు సాగనున్నాయి. ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా మరింత పటిష్టంగా మారడంతో పాటు, పాలనలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Panchayat Raj Act : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధులపై కొత్త రూల్
-
Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
-
Virat Kohli Record: చేసింది ఏడూ పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
-
Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సెన్సేషన్
ట్రెండింగ్
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!