Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Government: జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. ప్రభుత్వం ముందు లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం కోసం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగంలో వారి సేవలను వినియోగించుకుంటూ ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాలపై వారికి ఉన్న పట్టును, అవగాహనను గుర్తించి, వారిని పర్యాటక మార్గదర్శకులుగా (టూరిస్ట్ గైడ్స్) నియమించాలని నిర్ణయించింది.
ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలు, కర్రిగుట్టలు వంటి పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయడంలో లొంగిపోయిన మావోయిస్టుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోనుంది. లొంగిపోయిన మావోయిస్టులకు ‘గిరిదర్శక్’ అనే పేరుతో ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అటవీ సంపద, స్థానిక పర్యాటక విశేషాలను పర్యాటకులకు వివరించే బాధ్యతను వీరు తీసుకోనున్నారు. ఈ విధుల్లో చేరడానికి ముందు వీరికి ఒక నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణను కూడా ప్రభుత్వం అందించింది. ముఖ్యంగా ములుగు అటవీ ప్రాంతంలోని పర్యాటక క్షేత్రాల్లో వీరిని గైడ్స్ గా నియమించి, పర్యాటకులకు మెరుగైన సేవలందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిర్ణయం ద్వారా అటవీ ప్రాంతాల్లోని పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, లొంగిపోయిన వారికి గౌరవప్రదమైన ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!