కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడున్న కరోనా బెడ్లకు అదనంగా, 25 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎలెక్టీవ్ ఆపరేషన్లను పోస్ట్ పోన్ చెయ్యాలని ప్రైవేటు ఆస్పత్రుల్లో మరిన్ని బెడ్స్ కరోనా కోసం పెంచాలని నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ కూడా సిద్ధం చేసింది. ఇక తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలు కఠినం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇందులో 3,08,396 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో కొత్తగా రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1788కి చేరింది.
Also Read
తాజావార్తలు
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!