Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్
- నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- హైదరాబాద్ పరిధిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ విఫలమైన ఓ యువకుడు జీవితాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. తీవ్ర మానసిక సంఘర్షణ తర్వాత ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. అయితే చనిపోయే ముందు ప్రేమ విఫలం కావడానికి గల కారణాలన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఇక చనిపోతున్నట్లుగా చెప్పి మాయమయ్యాడు. అంతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కాస్త పోలీసులకు చేరింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా జల్లెడ పట్టి యువకుడిని పట్టుకుని ప్రాణాలు కాపాడారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొల్లపాడకల్ గ్రామానికి చెందిన చేపంగి కిషోర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. ఈ సమాచారం కాస్త పోలీసులకు అందింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన సైబర్ క్రైమ్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అధికారులు, సదరు వ్యక్తి హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సెక్టార్ ఎస్సై సైదులు, పెట్రోల్ మొబైల్ సిబ్బంది అప్రమత్తమై ముచ్చర్ల గ్రామ శివారులో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సదరు యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో స్పందించి యువకుడు ఆత్మహత్యకు పాల్పడకుండా కాపాడారు. విచారణలో ప్రేమ విఫలం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయినట్లు చెప్పాడు. మొత్తానికి యువకుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు పోలీసులకు అప్పగించారు. బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
- CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
- Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
తాజావార్తలు
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!