NTV Telugu Site icon

తెలంగాణ‌లో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు.. కేసీఆర్ ఆదేశాలు

KCR

తెలంగాణ‌లో ఆయుష్మాన్ భార‌త్ ఎందుకు అమ‌లు చేయ‌డం లేదంటూ ఎప్ప‌టి నుంచి విమ‌ర్శ‌లు ఉన్నాయి.. ముఖ్యంగా క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ స‌ర్కార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేత‌లు.. అస‌లు ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు చేయ‌డానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిల‌దీశారు. ఈ నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్ట్‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ‌. దీంతో.. ఆయుష్మాన్ భార‌త్ అమ‌ల్లో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింద‌నే చెప్పాలి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకుంది.. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. ఆయుష్మాన్ భారత్ నియమ నిబంధనలను అనుసరిస్తూ.. రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్.