Site icon NTV Telugu

CV Anand : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు డీజీపీగా పదోన్నతి

Cp Cv Anand

Cp Cv Anand

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సహా ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ స్థాయికి పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందిన అధికారులను అదే పోస్టింగ్‌లలో కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఒక ఉత్తర్వులో, ముగ్గురు IPS బ్యాచ్‌లు CV ఆనంద్ (1991) రాజీవ్ రతన్ (1991) లతో పాటు డాక్టర్ జితేందర్ (1992)లకు డీజీలుగా పదోన్నతి లభించింది. అయితే.. ప్రస్తుతం సీవీ ఆనంద్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు. రాజీవ్ రతన్ పోలీస్ హౌంజిగ్ కార్పోరేషన్ ఎండీగా ఉన్నారు. అలాగే జితేందర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు.

Also Read : Gaddar Last Rites: గద్దర్ అంతిమయాత్రలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట వల్ల సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను డీఐజీలుగా ప్రమోషన్ కల్పించింది. అంబర్ కిషోర్ ఝా, రెమా రాజేశ్వరీ, ఎల్ ఎస్ చౌహాన్, కే. నారాయణ్ నాయక్, పరిమల హనా నూతన్ జాకబ్, ఎస్, రంగారెడ్డిలను డీఐజీగా ప్రమోట్ చేసింది.

Also Read : No-confidence Motion: రేపు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. ప్రారంభించనున్న రాహాల్‌ గాంధీ!

Exit mobile version