Gaddar Last Rites: గద్దర్ అంతిమయాత్రలో తీవ్ర విషాదం.. తొక్కిసలాట వల్ల సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siasat Managing Editor Zaheeruddin Ali Khan died due to Stampade at Gaddar Last Rites: ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అంతిమ యాత్రలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్ మహాబోధి స్కూల్ వద్ద జనాలు ఎక్కువయి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. భారీ సంఖ్యలో చేరుకున్న గద్దర్ అభిమానులు.. స్కూల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్థలం సరిపోదని పోలీసులు చెప్పినా వినకుండా ముందుకు భారీగా తోసుకు రాగా అక్కడి తొక్కిసలాటలో ఓ వ్యక్తి చనిపోయారు. అయితే పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిజానికి జనాల మధ్యలో నీరసంతో సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ , సీనియర్ జర్నలిస్ట్ పడిపోయారు.
Also Read
పోలీసులు తొక్కిసలాట అనంతరం ప్రభుత్వం స్థానికంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు డాక్టర్ల దగ్గరకు తీసుకు వెళ్లగా జహీరుద్దీన్ చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన జహీరుద్దీన్ అలీ ఖాన్ వయస్సు 63 సంవత్సరాలు. ఇక అక్కడి సమాచారం మీకు ఆయన గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం నుంచి డీసీఎం వెహికిల్ లోనే ఉన్నారని మధ్యలో ఒకసారి దిగి.. మళ్లీ ఎక్కారని అంటున్నారు. అయితే గద్దర్ ఇంటి వద్దకు రాగానే.. వెహికల్ దిగడానికి ప్రయత్నించి అలా కుదరక పోవడంతో వెంటనే కింద పడ్డాడు. అప్పుడే తోపులాట జరిగిందని ఈ తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురై, గుండెపోటుతో చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. ఇక ఆయన మృతికి పలు జర్నలిస్టు సంఘాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?