తెలంగాణ ప్రభుత్వం.. వెంచర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ప్రభుత్వ భూములను వేలం వేయడంపై విమర్శలు వచ్చాయి.. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు కొందరు నేతలు.. అయితే, హైకోర్టు కూడా ప్రభుత్వ భూముల వేలానికి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.. ఇక, మరోవైపు.. రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది… బ్యూటీ ఫుల్ లే ఔట్స్, వెంచర్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.. పదుల ఎకరాల్లో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
Read Also: KTR: వన దేవతలకు నిలువెత్తు బంగారం..
ప్రైవేట్, అసైన్డ్, ప్రభుత్వ భూములతో కలిపి ఈ లే ఔట్స్ ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం… మరోవైపు.. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రైవేట్ భూములను సేకరించేందుకు సిద్ధఅవుతున్నట్టుగా తెలుస్తుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.. మొదటగా ఈ లేఔట్స్, వెంచర్లను ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.. తామే లేఔట్స్, వెంచర్లు ఏర్పాటు చేస్తే.. ప్రజలు నమ్మకంతో ప్లాట్స్ కొంటారని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం..