Telangana: నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ఉంది. తాజాగా వయోపరిమితి సడలింపుపై తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసును 44 ఏళ్లకు పెంచింది.
తాజాగా సడలించిన గరిష్ట వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంది. కాగా వయో పరిమితి సడలింపు పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం వయోపరిమితి ఓసీలకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లుగా ఉంది. అలాగే దివ్యాంగులకు 44 ఏళ్లుగా ఉంది. కాగా ఏ క్షణంలోనైనా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!